FLIPCART.COM

Sunday, 13 November 2016

పవన్ వెంట టీడీపీ ఎమ్మెల్యే

పవన్ వెంట టీడీపీ ఎమ్మెల్యే

Image result for pawan
వచ్చే ఎన్నికల దిశగా ప్రస్థానం ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం టీడీపీపై పడనున్నట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. టీడీపీ నుంచి నేతలు ఆయన వెంట నడిచే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ పవన్ వెంట నడుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా అనుభవం తక్కువైనప్పటికీ టీడీపీకి ఆయన మంచి ఎస్సెట్ గా ఉన్నారు. విపక్షాలపై విరుచుకుపడడంతో బొండా ముందువరుసలో ఉంటారు. అయితే... కొన్నాళ్లుగా ఆయన స్వరం వినిపించడం మానేసింది. పైగా ఇటీవల కాలంలో ఆయన పవన్ పై తెగ ప్రేమ కురిపిస్తున్నారట. టీడీపీ నేతలు పవన్ ను విమర్శించినా తట్టుకోలేకపోతున్నారట.

గతంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ పవన్ ను విమర్శిస్తే… టీజీపై బొండా ఉమ టీజీపై విమర్శల వర్షం కురిపించారు. ఒకప్పుడు ప్రజారాజ్యంలో చేరిన బొండా ఉమ… జనసేనలోనూ చేరొచ్చనే పుకార్లు జోరందుకున్నాయి. పైగా బొండా ఉమ కాపు వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆయనపై జనసేనలో చేరాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఆయనతో పాటు మరికొందరి పేర్లూ వినిపిస్తున్నాయి.. 

No comments:

Post a Comment