చిరు చెప్పిన ఆ మాటకు వరుణ్ కన్నీళ్లు
మోకాలికి తీవ్ర గాయం కావడంతో షూటింగులకు సెలవిచ్చేసి నెలన్నరగా ఇంటిపట్టునే ఉండిపోయాడు కొణిదెల వరుణ్ తేజ్. ఈ ఖాళీలో ఇంట్లోవాళ్లతో సరదాగా గడిపిస్తున్న వరుణ్.. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీకి ఒక లెంగ్తీ పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడాడు. పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి.. బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. అతనేమన్నాడంటే..
''చిన్నప్పటి నుంచి నేను పెదనాన్న పెట్. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అయన దగ్గరే ఉండేవాడిని. ఇప్పుడు కాలికి గాయమయ్యాక కూడా వారం రోజులుగా ఆయన దగ్గరే ఉంటున్నా. మేమంతా ఈ స్థాయికి రావడానికి పెదనాన్నే ఆయనే కారణం. మేం జీవితంలో ఏమవుతామో తెలుసుకుని ఆ దిశగా మమ్మల్ని ముందుకు నడిపారు. ఓ సందర్భంలో నటన గురించి చెబుతూ ప్రేక్షకుడు నీ మీద 150 రూపాయలు ఎందుకు ఖర్చుపెట్టాలో చెప్పు అని అడిగారు. ఆయన అడిగిన ఆ ప్రశ్నకు నాకు ఏడుపొచ్చింది. ఆ మాటల నుంచే ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకున్నాను. ఇక కళ్యాణ్ బాబాయ్ ని చూసి ఎప్పటికప్పుడు సూర్తి పొందుతుంటాను. ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా. నాకు.. సాయిధరమ్ తేజ్‌కు ఆయన ఎన్నో విలువలు నేర్పించారు. సినిమాల్లోకి రావాలనుకున్నపుడు నీదంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకో.. అన్నారు'' అని వరుణ్ తేజ్ తెలిపాడు.

No comments:
Post a Comment