FLIPCART.COM

Sunday, 13 November 2016

చరణ్-కొరటాల.. గొడవలేమీ లేవబ్బా

చరణ్-కొరటాల.. గొడవలేమీ లేవబ్బా


Image result for charan koratala
తొలి సినిమా 'మిర్చి' రిలీజైన వెంటనే రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు కొరటాల శివా. ఐతే ప్రారంభోత్సవం జరుపుకున్నాక ఆ సినిమా అనూహ్యంగా ఆగిపోయింది. రామ్ చరణ్-కొరటాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. అందుకే ఆ సినిమా ఆగిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు కొరటాల. ఈ సినిమా తర్వాత చరణ్.. కొరటాలతో పని చేయడానికి ఆసక్తి చూపించాడని.. ఐతే కొరటాల మాత్రం ఎన్టీఆర్ తో'జనతా గ్యారేజ్' చేశాడు. ఆ తర్వాత మహేష్ తో రెండో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ మధ్య జనతా గ్యారేజ్ ప్రమోషన్ల సందర్భంగా చరణ్ సినిమా విషయంలో కొంచెం అన్యమనస్కంగా మాట్లాడాడు కొరటాల. దీంతో చరణ్-కొరటాల మధ్య దూరం పెరిగినట్లుగా వార్తలొచ్చాయి.

ఇలాంటి తరుణంలో 'ధృవ' షూటింగ్ స్పాట్లో కొరటాల కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన'ధృవ' మేకింగ్ వీడియోలో కొరటాల దర్శనమిచ్చాడు. చరణ్ తో ముచ్చట్లు చెబుతూ కనిపించాడు. ఈ వీడియోలో సుకుమార్ కూడా కనిపించాడు కానీ.. అతను చరణ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల-చరణ్ ముచ్చట్ల నేపథ్యంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో భవిష్యత్తులో సినిమా ఏమైనా రాబోతోందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా ఉంటుందో లేదో కానీ.. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వీళ్లిద్దరి సంబంధాలపై ఉన్న సందేహాలు మాత్రం తొలగిపోయాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలేమీ లేవని.. భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశాలున్నాయని అర్థమైంది

No comments:

Post a Comment