FLIPCART.COM

Monday, 12 June 2017

SUCIDE SQAD

https://www.primevideo.com/ref=dvm_soc_fba_in_ap_s_900000155

THIS WEEK RASIPHALALU IN TELUGU

ఈ వారం రాశిఫలాలు: జూన్ 9 నుంచి 16వ తేదీ వరకు

 మేషం రాశివారు ;(అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము) 5,6,7 తేదిల్లో ఈ దశలో చంద్రుడు సప్తమమున ప్రవేశించును. ఇది మంచి మార్పులు తెచ్చును. కార్యసిద్ధి ఆనందము కలుగును. ధనలాభము, పాతబాకీలు తీరి, ధనము చేతికి వచ్చును. నూతన వాహన లాభము, కీర్తి, సౌఖ్యము, ఆనందమును సంపాదించుదురు. శత్రువుల పై జయము సాధిస్తారు, నూతన పరిచయాలు పెరుగును. వైవాహక జీవితములో ఆనందమును పొంది సుఖముగా ఉందురు. 8,9 తేదిలలో ఈ దశలో శత్రువులు పెరుగుతారు, అనవసరముగా విరోధములు ఎవరితోను పెటుకొనరాదు. శరీరముపై శ్రద్ధ చూపించాలి, లేనిచో ఆరోగ్య భంగములు కలుగును. అనవసరమైన భయము, ఆత్రుత వలన మనశ్శాంతికి భంగము వాటిలును. సత్తువ లేని భోజనము చేయరాదు. అనవసరమైన సహవాసము చేయరాదు. 


వృషభ రాశివారు ;(కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు) 5,6,7 తేదిల్లో ఈ దశలో చంద్రుడు షష్టమ గ్రహములోనికి ప్రవేశిస్తాడు. మంచి కాలము. యోగాదాయకమైన కాలము. అన్ని కలసివచ్చును. మంచిపేరు సంపాదిస్తారు, శత్రువులు తగ్గిపోతాయి, సజ్జనులతో సహవాసము కలుగవచ్చును. ఆరోగ్యము బాగుండును, ఆనందముగా ఉందురు. 8,9 తేదిలలో నూతన వాహన లాభము, కీర్తి, సౌఖ్యము, ఆనందమును సంపాదించుదురు. శత్రువుల పై జయము సాధిస్తారు, నూతన పరిచయాలు పెరుగును. వైవాహక జీవితములో ఆనందమును పొంది సుఖముగా ఉందురు. ఆరోగ్యముగా ఉందురు. మనశ్శాంతి, బంధువర్గములతో సౌఖ్యము కలుగవచ్చును. ఇది మంచి కాలము.


 మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు) 5,6,7 తేదిల్లో ఈ దశలో చంద్రుడు పంచమ గ్రహములో ప్రవేశించును. ఇది కూడా తగిన కాలము కాదు. ఏది తలపెట్టినా కలసిరాదు. ఇబ్బందులు ఎదుర్కొనగలరు. వృత్తి, వ్యాపారములు కలసిరావు. దూర ప్రయాణములలో ఇబ్బందులు కలుగును. ఏది తలపెట్టినా కలసి రానందున మనశ్శాంతి కరువై, చింత పెరుగును, గడుకాలము, అయితే మీ స్నేహితతులకు వచ్చిన మంచిపేరు మిమ్మల్ని మరింత కృంగదీస్తుంది. 8,9 తేదిలలో మంచి కాలము. యోగాదాయకమైన కాలము. అన్ని కలసివచ్చును. మంచిపేరు సంపాదిస్తారు, శత్రువులు తగ్గిపోతాయి, సజ్జనులతో సహవాసము కలుగవచ్చును. ఆరోగ్యము బాగుండును, ఆనందముగా ఉందురు. 


కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు) 5,6,7 తేదిల్లో ఈ దశలో చంద్రుడు చతుర్ధమున గ్రహములో ప్రయాణిస్తాడు. చెడ్డకాలము. శారీరక బాధ కలుగవచ్చును. దేహారోగ్య విషయములో మీరు, మీ కుటుంబ సభ్యులు శ్రద్ధ వహించగలరు. కడుపు మరియు గుండె నొప్పులు పొందుదురు. శారీరక చింత పొందుదురు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మిమ్మల్ని బాధించును. మనశ్శాంతి కరువు అగును. 8,9 తేదిలలో దూర ప్రయాణములలో ఇబ్బందులు కలుగును. ఏది తలపెట్టినా కలసి రానందున మనశ్శాంతి కరువై, చింత పెరుగును, గడుకాలము, అయితే మీ స్నేహితతులకు వచ్చిన మంచిపేరు మిమ్మల్ని మరింత కృంగదీస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టము కలగవచ్చును. ఆచితూచి ఖర్చు చేయవలెను. శరీరముపై మరింత శ్రద్ధ చూపవలెను. ఆరోగ్య నష్టము కలుగవచ్చును. వృత్తి వ్యాపారములందు జాగ్రత్తగా వ్యవహరించాలి. 


సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం) 5,6,7 తేదిల్లో ఈ దశలో చంద్రుడు మీ తృతీయ గ్రహములో ప్రయాణించును. అనుకున్న పనులు నెరవేరును. ఈ దశలో మంచి పేరు గడించగలరు. ఈ దశ ఆదాయపరముగా బాగుండును, వీరు ఋణములు తీర్చగలరు, ధనలాభము కలుగవచ్చును. గృహములో ఆనందము, మంచి పదార్ధములు భుజించును, నూతన వస్త్ర లాభము, 8,9 తేదిలలో శారీరక చింత పొందుదురు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మిమ్మల్ని బాధించును. మనశ్శాంతి కరువు అగును. మనసున భీతి కలుగును, మనో నిబ్బరము ఉండాలి.ధన నష్టము, ఖర్చులు పెరుగును, డబ్బు విషయాలలో జాగ్రత్తగా మసలు కోవాలి. గృహములో కలహములు, అయిన వారితో విరోధములు అనవసర విషయాలలో తలదూర్చరాదు.


 కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు) 5,6,7 తేదిల్లో ఈ పనిలో చంద్రుడు మీ ద్వితీయ గ్రహములో ప్రవేశించును. ధన నష్టము, అనవసర ఖర్చులు తగ్గించుకొనవలెను. ఈ కాలములో ఇతరులతో మితముగా ప్రవించవలెను. అనవసర విరోధములు పనికి రావు. మీ గౌరవమునకు భంగము కలుగును. యోచనా శక్తి వలన కొన్ని ఇబ్బందులకు గురి కాగలరు. వృత్తి వ్యాపారములలో ఇబ్బందులు రాగలవు. కాని ధైర్యముతో వ్యవహరించాలి. 8,9 తేదిలలో ఈ దశలో మంచి పేరు గడించగలరు. ఈ దశ ఆదాయపరముగా బాగుండును, వీరు ఋణములు తీర్చగలరు, ధనలాభము కలుగవచ్చును. గృహములో ఆనందము, మంచి పదార్ధములు భుజించును, నూతన వస్త్ర లాభము, అయిన వారితో మంచి సంబంధము, మనశ్శాంతి, మంచి సౌఖ్యము, స్నేహవృద్ధి, సజ్జనులతో సహవాసము పొందగలరు. 



తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు) 5,6,7 తేదిల్లో ఈ దశలో చంద్రుడు మీ మొదటి గ్రహములో ప్రవేశించును. దీని వలన మీ జీవితములో మంచి మార్పులు సంభవించును. మంచి వస్త్రాలు ధరించుటకు, రుచికరమైన పదార్ధములు భుజించుటకు మరియు సుగంధ ద్రవ్యములు వాడుటకు సరియైన సమయము. ఈ సమయములో మీరు మంచి స్నేహితులను మరియు కావలసిన వారిని పొందగలరు. దీని వలన మీ మనస్సునకు, శరీరమునకు ఎంతో ఆనందం సుఖం కలుగగలదు. మీ వైవాహిక జీవితము కూడా చక్కగా నడుచుకొనగలదు. మీ జీవిత భాగస్వామి నుండి మరింత ప్రేమ పొందుతారు 8,9 తేదిలలో మీ గౌరవమునకు భంగము కలుగును. యోచనా శక్తి వలన కొన్ని ఇబ్బందులకు గురి కాగలరు. వృత్తి వ్యాపారములలో ఇబ్బందులు రాగలవు. కాని ధైర్యముతో వ్యవహరించాలి. శారీరకముగా నిరుత్సాహము కలుగును. మనో నిబ్బరముగా ఉండాలి. నేత్ర బాధలు కలుగును. ఈ కాలములో మానసికముగా దిగులు పొందుదురు. ఈ దశలో నేత్రములకు ప్రత్యేక శ్రద్ధ అవసరము, తిండిపై శ్రద్న చూపించవలెను. 


వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు) 5,6,7 తేదిల్లో ధననష్టము, కష్టకాలము, ధన వ్యయము పెరుగును. విలువైన వస్తువులు పోగలవు. అనవసర ఖర్పులు పెట్టరాదు. ఆశించిన ఫలితములు లభించవు. శారారక శ్రద్ధ అవసరము, నేత్ర జబ్బులు సంభవించవచ్చును. మనశ్శాంతి కరువగును, అసూచ పెరుగుతుంది. ఇతరులతో మెలిగినపుడు జాగ్రత్త అవసరము. నిర్ణయములు తీసుకొన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి, వృత్తి, వ్యాపారములందు జాగ్రత్తగా మసలుకోవాలి లేదా మీ హోదాకు భంగము కలుగును. బంధువర్గములతో విరోధములు పెరుగును, అపవాదములు కలుగును, కీర్తి భంగము కలుగవచ్చును. 8,9 తేదిలలో మీ జీవిత భాగస్వామి నుండి మరింత ప్రేమ పొందుతారు. ఈ దశ మీకు అదృష్టమును, ఆనందమును మరియు గొప్ప పేరును తేగలదు. ఈ దశలో మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యముగా ఉందురు. మీరు మనశ్శాంతిగా ఉందురు. కాని ప్రతీ విషయమును లోతుగా ఆలోచించి అనవసరమైన బాధకు గురి కావలదు. ఈ దశ ధనాదాయమును తెచ్చును. 


ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం) 5,6,7 తేదిల్లో ఈ దశ మీ ధనలాభమునకు దోహద పడును. మీరు వ్యవసాయము చేస్తే, ఎక్కువ పంట పండగలదు. ధనలాభము కలుగవచ్చును. అయిన వారితో ఉత్సాహముగా, ఆనందముగా ఉందురు. పాత స్నేహితులతో కలయిక ఏర్పడును. మీ వైవాహిక జీవితము ఆనందమయము అగును. మీరు అవివాహితులైతే, మంచి సంబంధము కుదురును. సకల సౌకర్యములు కలుగును. శారీరకముగా బాగుండును. మనశ్శాంతి లభించి, సుఖముగా ఉందురు. 8,9 తేదిలలో మనశ్శాంతి కరువగును, అసూచ పెరుగుతుంది. ఇతరులతో మెలిగినపుడు జాగ్రత్త అవసరము. నిర్ణయములు తీసుకొన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి, వృత్తి, వ్యాపారములందు జాగ్రత్తగా మసలుకోవాలి లేదా మీ హోదాకు భంగము కలుగును. బంధువర్గములతో విరోధములు పెరుగును, అపవాదములు కలుగును, కీర్తి భంగము కలుగవచ్చును. 



మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు) 5,6,7 తేదిల్లో ఇది మీకు మంచి కాలము. మీ కోరికలు నెరవేరును. అనుకున్న పనులు పూర్తమును. కార్యసిద్ధి, నూతన పనులు చేపట్టిన, కలసి వచ్చును. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందముగా ఉందురు. వృత్తి, వ్యాపారములు కూడా కలసి వచ్చును. మీ గౌరవము పెరుగును. ఉన్నత పదవులు, మంచి పేరు సంపాదించుకొనగలరు. అధికారము మీ చేతికి వచ్చును. సంఘములో మీరు కీర్తి గడించుదురు. 8,9 తేదిలలో మీ వైవాహిక జీవితము ఆనందమయము అగును. మీరు అవివాహితులైతే, మంచి సంబంధము కుదురును. సకల సౌకర్యములు కలుగును. శారీరకముగా బాగుండును. మనశ్శాంతి లభించి, సుఖముగా ఉందురు. 


కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) 5,6,7 తేదిల్లో కష్టములు సంభవించును. కష్టించి పని చేయవలెను. శరీరముపై శ్రద్ధ అవసరము, మనస్సునందు నిరాశ కలుగును. అయితే, మీరు మంచి పనులలో పాల్గొందురు, మంచి పనులు చేస్తారు, మంచి పేరు సంపాదిస్తారు. ఇది ఇక పరీక్షా కాలము. ధన నష్టము కలుగుటకు అవకాశము ఉన్నది. ఇంట్లో విరోధములు కలుగును. మీ యొక్క శత్రువలపై ఓ కన్నేసి ఉండగలరు. శత్రువుల వలన నష్టము చేకూర్చుటకు అవకాశము ఉన్నది. 8,9 తేదిలలో వృత్తి, వ్యాపారములు కూడా కలసి వచ్చును. మీ గౌరవము పెరుగును. ఉన్నత పదవులు, మంచి పేరు సంపాదించుకొనగలరు. అధికారము మీ చేతికి వచ్చును. సంఘములో మీరు కీర్తి గడించుదురు. మీరు స్త్రీ అయితే కొన్ని శారీరక జాగ్రత్తలు అవసరము, గర్భాధారణ విషయములో జాగ్రత్త అవసరము. మొత్తము మీద శారీరకముగా బాగుండును. రుచికరమైన భోజనము లభిస్తుంది.



 మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు) 5,6,7 తేదిల్లో ఇది అంత మంచి దశ కాదు. వృతి, వ్యాపారములలో విష్నుములు, అనుకోని అవాంఛనీయములు కలుగవచ్చును. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చడము కష్టతరము అగును. అధికారులతో మంచిగా మెలగాలి, వృత్తిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర వాదనలకు దిగరాదు. ఈ దశలో శత్రువులు పెరుగుతారు, అనవసరముగా విరోధములు ఎవరితోను పెటుకొనరాదు. 8,9 తేదిలలో మంచి పేరు సంపాదిస్తారు. ఇది ఇక పరీక్షా కాలము. ధన నష్టము కలుగుటకు అవకాశము ఉన్నది. ఇంట్లో విరోధములు కలుగును. మీ యొక్క శత్రువలపై ఓ కన్నేసి ఉండగలరు. శత్రువుల వలన నష్టము చేకూర్చుటకు అవకాశము ఉన్నది. చిన్న పిల్లలతో వాదనకు దిగవదు, లేనిచో వారు మీకు దూరము కాగలరు. అనవసనమైన విరోధములు తెచ్చుకొని, చెడ్డపేరు తెచ్చుకొనవలదు. అనవసరమైన చింత పెంచుకొనరాదు.